సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే కూనంనేని భేటీ
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీఅయ్యారు. రాష్ట్ర సచివాలయంలో గంటపాటు జరిగిన చర్చల్లో కొత్తగూడెం నియోజకవర్గానికి సంబందించిన ప్రధాన సమస్యలను కూనంనేని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కూనంనేని ప్రతిపాదించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందింస్తూ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషనుగా ఏర్పాటు చేయాలనే కూనంనేని ప్రతిపాదనను ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన ప్రక్రియను త్వరలో చేపడతామని సీఎం తెలిపినట్లు కూనంనేని తెలిపారు.
అదేవిధంగా కేటీపీఎస్ తొలిగంచబడిన ఏ బి సి విద్యుత్ స్టేషన్ల స్థలంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు కూనంనేని తెలిపారు. జిల్లా రైతాంగ సాగునీరు అవసరాలు తీర్చేందుకు సీతారామ ప్రాజెక్టు డిజైన్ మార్చేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారని, అదేవిధంగా పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రెవిన్యూ సమస్యలు పరిష్కరించే చర్యలు తీసుకుంటామని తెలిపారని, ప్రధానంగా పాల్వంచలోని 444, 817, 999, 727 తదితర సర్వే నంబర్లలో నెలకొన్న రెవిన్యూ సమస్యలకు శాశ్వత పరిస్కారం చూపుతానని సీఎం హామీ ఇచ్చారని, పాల్వంచ కొత్తగూడెం బైపాస్ రోడ్డు, నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేయిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా మరో పది డయాలసిస్ యంత్రాల ఏర్పాటుకు అదేవిధంగా కొత్తగూడెం పట్టణ ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ జీవో 76ను పునరుద్ధరించి త్వరితగతిన యజమానులకు పట్టాలు జారీ అయ్యేవిదంగా ఆదేశాలు జారీ చేస్తానని సీఎం హామీ ఇచ్చారని కూనంనేని తెలిపారు. ఇప్పటికే వివిధ పథకాలక్రింద సుమారు రూ.12కోట్ల వ్యయంతో అంతర్గ రోడ్లు, డ్రైన్లు పూర్తి కావస్తుండగా ఇటీవలే పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు యూనిట్లతో కూడిన డియలసీస్ కేంద్రాన్ని కూనంనేని సాధించారు. గెలిసిన ఆరునెల్లలోనే నియోజకవర్గ ప్రజలకు గెలుపు ఫలాలు అందుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.