పెళ్లికి అందుకే దూరం -సదా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ హీరోయిన్..లేటు వయసులోనూ కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తించే విధంగా ఎప్పటికప్పుడు ఫోటోషూట్ తన సోషల్ మీడియాలో పెట్టే సదా పెళ్లి చేస్కోకపోవడానికి గల కారణాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపింది.
ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం స్వేచ్ఛగా ఉంటున్నాను. పెళ్లి చేసుకుని దానిని వదులుకోలేనని తెలిపారు. అయితే ఎవరూ ఇంతవరకూ నా హృదయానికి దగ్గర కాలేదు.
మున్ముందు నాహృదయానికి దగ్గరై నాకు ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. నేను పెద్దలు కుదిరిచ్చిన పెళ్లికి చాలా వ్యతిరేకం. లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను.
అయితే పెళ్లైనాక భాగస్వామిని భరించడం కష్టం అనిపిస్తే విడాకులు తీసుకోవడంలో తప్పు లేదు. ఇబ్బందులు పడుతూ కాపురం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.