మోదీ కేబినెట్ తొలి నిర్ణయం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో 72మందితో కొలువుదీరిన మంత్రివర్గం ఈ రోజు సోమవారం సాయంత్రం ఐదు గంటలకి సమావేశం అయిన సంగతి తెల్సిందే.
ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ తన తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదల పైల్ పై చేశారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో దేశంలో అర్హులైన పేదలకు ఇండ్లను నిర్మించాలనే తొలి నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో దాదాపు మూడు కోట్ల ఇండ్లను పీఎం అవాస్ యోజన పథకం కింద పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ఉచితంగా ఈ ఇండ్లను నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.