రామోజీ రావు మృతి పట్ల మంత్రి సంతాపం
గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందిన ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపై తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి పత్రిక, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు..
ఆయన ఎదిగిన తీరు తెలుగు జాతికి రామోజీరావు గర్వకారణంగా నిలిచారని ఈసందర్భంగా మంత్రి గుర్తు చేశారు. రామోజీ రావు జీవితం అత్యంత నిబద్ధత, క్రమశిక్షణ పట్టుదలతో బతికిన వ్యక్తి అని అన్నారు.