రామోజీ రావు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి దిగ్భ్రాంతి
ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావు (87) మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు.ఈనాడు సంస్థలను స్థాపించి ఎంతో శ్రమించి..వాటిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన శ్రమజీవి రామోజీరావు గారని గుర్తుచేశారు.
ఈనాడు సంస్థల ద్వారా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారని… ఎంతో మందికి ఆర్థిక సహాయాలు, పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారని అన్నారు.
తెలుగు టెలివిజన్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన సృజనాత్మక రూపశిల్పి రామోజీరావు గారని…Etv న్యూస్ ద్వారా జర్నలిజానికి సరైన అర్థం చెప్పారని.. ఎన్నో న్యూస్ ఛానెల్స్ కు డిక్షనరీగా మారిన రామోజీరావు గారు లేరనే సత్యం జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.రామోజీరావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.