రేవ్ పార్టీలో హేమ -వీడియోలో క్లారిటీ
కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే తనపై వస్తోన్న వార్తల గురించి ఓ వీడియోలో నటి హేమ క్లారిటీచ్చారు..
తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ క్లారిటీ ఇస్తూ ‘నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్ హౌస్‌లో చిల్ అవుతున్నాను. నాపై వస్తోన్న వార్తలు నమ్మకండి. ఆ వార్తలో నిజం లేదు.
బెంగళూరు ఫామ్‌హౌస్‌లో ఎవరున్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను నమ్మకండి’’ అని హేమ వీడియో ద్వారా తెలిపారు