ప్రశ్నించినందుకు అరెస్టు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా ప్లాట్ ఫారం వాట్సాప్ లో నిలదీశారని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు..
హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్ పరిధిలో గాంధీ ఆసుపత్రి దుస్థితి గురించి
హైదరాబాద్–వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తి “తుర్కయంజాల్” అనే వాట్సప్ గ్రూపులో “గాంధీ ఆసుపత్రిలో నీళ్లు లేవు, ఆపరేషన్లు బంద్ చేశారు..సిగ్గు సిగ్గు రేవంత్” అనే పోస్ట్ ను మురళీధర్ రెడ్డి(44) పోస్టు చేశారు..
ఇది గమనించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు..
దీంతో దర్యాప్తు చేసి మురళీధర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు..