ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

N. Chandrababu Naidu Chief Minister of Andhra Pradesh
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసును సీబీఐకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీచ్చారు.
తీరా అధికారంలోకి వచ్చాక జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని సుగాలి ప్రీతి తల్లి ఆరోపించిన సంగతి తెల్సిందే. ఆమె వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును సీబీఐకు అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతకుముందు సుగాలి ప్రీతి తల్లి పార్వతీ మాట్లాడుతూ తన కూతురు సుగాలి ప్రీతి హత్యాకేసులో న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం ను ఎన్నో సార్లు వేడుకున్నారు. హైకోర్టుకు వచ్చిన ప్రతిసారి ఆయన్ని కలవడానికి ప్రయత్నించాను. అయినా నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. కేవలం ఎన్నికల కోసమే ఈ వ్యవహారాన్ని వాడుకున్నారు అని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.