రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కావాలి

Jilla Shankar
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : హైదరాబాద్ తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ( TSGENCO) ర్యాలయంలో రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు మరియు TSGENCO మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. హరీష్ ఐఏఎస్ గార్లతో కలిసి బుధవారం రోజున రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిసన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు,గౌరవ సభ్యులు .ఎస్సి,ఎస్టీ ఉద్యోగుల రూల్ అప్ రిజర్వేషన్ల పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు సభ్యులు జిల్లా శంకర్ గారు అన్నారు. ఎస్సీ ఎస్టీల ఉద్యోగుల విధి నిర్వహణకు సంబంధించిన ఏ ఉద్యోగికైనా వివక్షతకు గురైతే నేరుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రూల్ అప్ రిజర్వేషన్ అమలుకు సంబంధించి ఉద్యోగులు తమ సమస్యలను కమిషన్ చైర్మన్, సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు.
కొన్ని క్యాడర్లలో పదోన్నతులు తమకు అన్యాయం జరుగుతుందని కొంతమంది ఎస్సీ ఎస్టీ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విషయాలు తమ సమస్యలను కమిసన్ చైర్మన్ గారికి మరియు సభ్యులు జిల్లా శంకర్ గారికి వినతి పత్రాలు ఇచ్చారు. రూల్ అప్ రిజర్వేషన్ ల ఎస్సి,ఎస్టీ ఏ ఉద్యోగికైనా నిర్లక్ష్యం చేస్తే ఆ అధికారి పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా అమలు కావాలని ఈ విషయంలో యాజమాన్యం కమిషన్ దృష్టి కి రాకుండ చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి , రేణికుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్, రాంబాబు నాయక్,మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. హరీష్ ఐఏఎస్ గారు, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.