“కూలీ” మూవీ టిక్కెట్ల రేట్లు పెంపు..!

cooli movie
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ మన్మధుడు, స్టార్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ “కూలీ”. లోకేశ్ కనగరాజు తెరకెక్కించిన ఈ సినిమా సన్ ఫిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు.
తమిళ స్టార్ హీరో ఉపేంద్ర, శృతిహాసన్, పూజా హెగ్డే, సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, సౌబార్ షాహీర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ యంగ్ సంచలనం అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈనెల పద్నాలుగు తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కూలీ మూవీ టిక్కెట్ల రేట్లను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్లలో రూ.75లు, మల్టీప్లెక్సుల్లో రూ.100చొప్పున పెంచుకునేందుకు అనుమతిచ్చింది. ఈ పెంపు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు అమల్లో ఉంటుంది. మరోవైపు విడుదల రోజు ఉదయం ఐదు గంటలకు అదనపు షోకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.