బండారు దత్తాత్రేయ నివాసంలో ఘనంగా రాఖీ వేడుకలు..!

Rakhi celebrations held at Bandaru Dattatreya’s residence..!
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లోని వారి నివాసంలో వారి కుటుంబ సభ్యులు, పారిశుద్ధ కార్మికుల మరియు శ్రేయోభిలాషులతో రక్షా బంధన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రక్ష బంధన్ పండుగ సోదరి సోదరుల ప్రేమ, ఆత్మీయతకు , అనురాగానికి ప్రతీక అని, ఒక సోదరి తన సోదరునికి రాఖీ కట్టి తన సంతోషాన్ని పంచుకోగా సోదరుడు ఎల్లవేళలా తన సోదరికి అండగా ఉంటానని సంకల్పం తీసుకుంటాడని పేర్కొన్నారు.
ఈ రక్షా బంధన్ సందర్భంగా దత్తాత్రేయ మనవరాళ్లు జశోదర, వేదాంషి మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులు, శ్రేయోభిలాషులు నాకు రాఖీ కట్టడం ఎంతో ఆనందాన్ని కలిగింగించిందని, ఈ కార్మికులు మన వీధుల్ని, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుతూ మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారని, అటువంటి వారిని మన కుటుంబ సభ్యులుగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు.
తాను గతం లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమానికై అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని, వారి ఉద్యోగ భద్రత, పెన్షన్లు, గ్రాట్యుటీ, పీ ఎఫ్, ఈ.ఎస్.ఐ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాల పరిధిని విస్తృతం చేసి పారదర్శకతతో ముందుకు తీసుకెళ్లడం జరిగిందని గుర్తుచేశారు.ఈ రక్షా బంధన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మన కుటుంబ బంధాలను మరింత మెరుగు పరిచే పవిత్రమైన సంప్రదాయమని,ఈ పండుగను మనం ఆనందంగా జరుపుకోవడంతో పాటు, మన చుట్టూ ఉన్నవారితో ప్రేమ, సహాయం, రక్షణ కోసం అందరం పడదామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సోదరీమణులు కూడా పాల్గొనడం తనకు మరింత సంతోషాన్ని కలిగించిందని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.