కష్టకాలంలో పవన్ కి అండగా ఆ ‘దర్శకుడు’..?

pawan kalyan
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో జరిగింది.
ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ ఫిల్మ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు మిత్రుడు, ఆపద్బాంధవుడు’ అని అన్నారు. ‘ గతంలో ఒక్క ప్లాప్ మూవీ తీయగానే నాకు సినిమాలపై గ్రిప్ పోయింది. ఆ కష్టకాలంలో ఎవరూ నాతో సినిమా తీయలేదు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి నాతో ‘జల్సా’ మూవీ తీశారు. అప్పుడు ఆయన ఎవరో కూడా నాకు తెలియదని’ పవన్ అన్నారు.
తనవద్ద ఆయుధాలు, గూండాలు లేరని.. అండగా నిలిచే అభిమానులు మాత్రమే ఉన్నారు. నా విజయంలోనే కాదు నాకష్టకాలంలో కూడా అభిమానులు నావెంట నడిచారని ఆయన అభిమానులను కొనియాడారు.