నేను రీమేక్స్ చేయడానికి కారణం ఇదే- పవన్

Pawan Kalyan
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పవర్ స్టార్ , సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ తన సినిమా కేరీర్ లో డైరెక్ట్ సినిమాల కంటే రీమేక్స్ సినిమాలే ఎక్కువగా చేశారు. దీనిపై విమర్శలు సైతం ఉన్నాయి.
తాజాగా ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో దీనిపై పవన్ కళ్యాణ్ క్లారిటీచ్చారు. ప్రీరిలీజ్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ నాకు పెద్ద పెద్ద దర్శకులు లేరు. నేను రీమేక్స్ చేసేది కొత్త సినిమాలు చేయడం నాకు చేత కాక కాదు. రీమేక్స్ వల్ల నా పని మరింత ఈజీ అవుతుంది. అప్పుడు వాటి వల్ల వచ్చే డబ్బులతో నేను, నాకుటుంబం , నా పార్టీని పోషించడం సులభతరమవుతుంది’ కదా అని వ్యాఖ్యానించారు.
గతంలో తనకు ప్లాప్ రావడంతో మళ్లీ నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది అని కూడా పవన్ వ్యాఖ్యానించారు. తాను సొంత స్టోరీతో తీసిన జానీ సినిమా తన కేరీర్ లోనే అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అఖరికీ హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ హిట్ సాధించే వరకూ పదేండ్ల పాటు పవన్ హిట్ రుచి చూడకపోవడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది.