జాన్ అబ్రహం తో పెళ్లి వార్తలపై జెనీలియా హాట్ కామెంట్స్

 జాన్ అబ్రహం తో పెళ్లి వార్తలపై జెనీలియా హాట్ కామెంట్స్

Genelia

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : రెడీ, బొమ్మరిల్లు లాంటి మూవీలతో సినీ ప్రేక్షకుల మెప్పించి, నాటి యువతరానికి కలల రాణిగా నిలిచిన నటి జెనీలియా . అప్పట్లో వరుస హిట్లతో, సినిమాలతో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. హీరోయిన్ గా టాప్ పోజిషన్ లో ఉండగానే బాలీవుడ్ ప్రముఖ హీరో జాన్ అబ్రహం తో జెనీలియా డేటింగ్ లో ఉన్నారు.

ఓ సినిమా సెట్ లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని తెగ ప్రచారం జరిగింది. పద్నాలుగు ఏండ్ల కిందట జరిగిన ఈ ప్రచారం పై తాజాగా జెన్నీ స్పందించింది. ప్రస్తుతం  సితారే జమీన్ పర్ మూవీలో కీలక పాత్రను జెనీలియా పోషించింది.

ఈ సినిమా ఈ నెల ఇరవై తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ఆ ప్రచారంపై స్పందిస్తూ ” కొంతమంది కావాలనే ప్రముఖ హీరోతో పెళ్లి అయిందని ప్రచారం చేశారు. వారు ఎవరో కూడా నాకు తెలుసు.ఓ సినిమా సెట్ లో పెళ్లి చేసుకున్నామని తెగ ప్రచారం జరిగింది. అలా ఎందుకు చేశారో నాకు ఇప్పటికి ఆర్దం కావడం లేదు” అని తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *