నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : సీఎం నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు భేటీ కానున్నది.
ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రెండో దశ భూసేకరణ, రాజధానిలో చేపట్టనున్న పలు నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం.
అదేవిధంగా కూటమి పాలనకు ఏడాది పూర్తి కావొస్తున్నందున దానిపైనా కూడా చర్చ జరగనున్నది. వీటీతో పాటు జూన్ ఇరవై ఒకటో తారీఖున వైజాగ్ లో జరగనున్న యోగాంధ్రపైనా చర్చించనున్నారు.