దేశంలో విజృంభిస్తోన్న కరోనా

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా అరవై ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు ఐదుగురు ఈ కరోనా భారిన పడి మృతి చెందారు. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,026 కు చేరింది.
అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,416, మహారాష్ట్రలో 494, గుజరాత్ లో 397, ఢిల్లీలో 393, వెస్ట్ బెంగాల్ లో 372, కర్ణాటకలో 311 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే, ఏపీలో 28, తెలంగాణలో 4 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.