ఐపీఎల్ -2025 విన్నర్ ఆర్సీబీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఐపీఎల్ -2025 ఫైనల్ విన్నర్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మాదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ పూర్తి ఓవర్లు ఆడి తొమ్మిది వికెట్లను కోల్పోయి 190 పరుగులు చేసింది.
191 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఏడు వికెట్లను కోల్పోయి 184 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక పరుగుకే అవుట్ అవ్వడంతో మ్యాచ్ ఆర్సీబీ వైపు తిరిగింది. చివర్లో శశాంక్ ఆర్ధశతకంతో చెలరేగిన కానీ అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేజారిపోయింది.
ఆర్సీబీ బౌలర్లల్లో భువనేశ్వర్, కృణాల్ చెరో రెండు వికెట్లతో తమ సత్తా చాటారు. బ్యాటింగ్ లో కోహ్లీ నలబై మూడు పరుగులతో రాణించారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమై పద్దెనిమిదేండ్ల తర్వాత ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి.