రేపు కుప్పంకు సీఎం చంద్రబాబు..!

Chandrababu Naidu Chief Minister of Andhra Pradesh
సింగిడిన్యూస్, కుప్పం: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు బుధవారం మే 21న తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు.
రేపు బెంగళూరు నుంచి మధ్యాహ్నాం పన్నెండున్నరకు హెలికాప్టర్ లో బయలు దేరి కుప్పంకు చేరుకుంటారు.
కుప్పంలో గంగజాతరలో భాగంగా జరిగే గంగమ్మ విశ్వరూప దర్శనంలో అమ్మవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకోనున్నారు.