రాజ్ భవన్ చోరీ కేసులో ట్విస్ట్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజ్ భవన్ చోరీ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల పద్నాలుగో తారీఖున హెల్మెంట్ పెట్టుకున్న వ్యక్తి రాజ్ భవన్ లోకి చొరబడి రెండు హార్డ్ డిస్క్ లను ఎత్తుకెళ్లి పోయారని రాజ్ భవన్ అధికారులు పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి శ్రీనివాస్ అనే రాజ్ భవన్ లో పని చేసిన మాజీ ఉద్యోగి అని తేలింది. రాజ్ భవన్ లో పని చేస్తుండగా తన సహచర మహిళా ఉద్యోగి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎవరో మార్ఫింగ్ చేశారని తనకు చెప్పడమే కాకుండా పంపి మరి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు.
దీంతో ఆ మహిళా ఉద్యోగి పంజాగుట్టలో పిర్యాదు చేయగా విచారణలో శ్రీనివాస్ అనే కన్ఫార్మ్ కావడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. తాజాగా బెయిల్ పై వచ్చిన శ్రీనివాస్ రాజ్ భవన్ లో ఈఘాతుకానికి పాల్పడినట్లు తేలింది.