జూన్ 12న హరి హర వీరమల్లు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఎప్పుడా ఎప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి.
ప్రముఖ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏఎం రత్నం నిర్మాతగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మూవీ హరి హర వీరమల్లు.
ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ చిత్రం మేకర్స్ తెలిపారు. వచ్చే నెల జూన్ పన్నెండు తారీఖున విడుదల చేయనున్నట్లు ఓ పోస్టరును విడుదల చేశారు. మార్చి ఆరో తారీఖునే చిత్రం షూటింగ్ పూర్తయిందని ప్రకటించిన కానీ విడుదలలో జాప్యం జరిగింది.