గీత దాటితే వేటే – రేవంత్ వార్నింగ్..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సీఎల్పీ సమావేశం ఈరోజు మంగళవారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటలో జరిగింది. ఈ భేటీకి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు తదితరులంతా తరలి వచ్చారు.
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పదవుల గురించి.. మంత్రివర్గ విస్తరణలో అవకాశాల గురించి ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు అంతా బహిరంగంగా తమకు ఇష్టమోచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎవరూ ఎన్ని మాట్లాడిన ఇక్కడ నా నిర్ణయం.. పైన ఢిల్లీలోని జాతీయ నాయకత్వం నిర్ణయమే ఫైనల్.
ఎవరైన హద్దులు మీరుతూ గీత దాటితే వేటు తప్పదు. మంత్రివర్గ విస్తరణలో చోటు కావాలన్నా.. పదవుల్లో స్థానం కావాలన్నా నా నిర్ణయం. పార్టీ నాయకత్వ నిర్ణయమే ఫైనల్ అనే సంగతి మదిలో పెట్టుకుని నడుచుకోవాలని హెచ్చారించినట్లు నోవాటెల్ లో కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు.
