హాస్టళ్లగా ప్రజాభవన్…!

Praja Bhavan as a hostel…!
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నివాసం ఉంటున్న ప్రజాభవన్ ను ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లగా మారుస్తామని బీసీ సంఘం సంక్షేమ జాతీయ అధ్యక్షుడు.. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చారించారు.
హైదరాబాద్ లోని ముసారాంబాగ్ లో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పదిహేను నెలల పాలనలో సంక్షేమ హాస్టళ్లన్నీ ఆగమయ్యాయి. ఎక్కడ చూసిన ఫుడ్ ఫాయిజన్ సంఘటనలే. హాస్టళ్లన్నీ అద్దె భవనాల్లోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించకపోతే ప్రజాభవన్ ను హాస్టళ్లగా మారుస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
