పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కు అదే తేడా…!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ తన సతీమణితో సహా ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన సంగతి తెల్సిందే. ఇటీవల సింగపూర్ లో ఉంటున్న పవన్ కల్యాన్ తనయుడు మార్క్ శంకర్ స్కూల్ లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు.
దీనికి సంబంధించి చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్ తిరిగి వచ్చారు. మార్క్ శంకర్ ను పరామర్శించడానికి బన్నీ హైదరాబాద్ లోని పవన్ ఇంటికెళ్ళారు. ఈ సంఘటనపై గతంలో జరిగిన పుష్ప -2 వివాదంలో హీరో అల్లు అర్జున్ ది ఎలాంటి తప్పు లేకపోయిన ఇటు పవన్ & కో అటు ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేశారు.
కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా తన మంచితనాన్ని చాటుతూ ఇవాళ పవన్ ఇంటికెళ్ళడం అతని గొప్పతనం. ఇదే పవన్ & బన్నీకి మధ్య ఉన్న తేడా అని సినీ క్రిటిక్స్.. బన్నీ ఫ్యాన్స్ తెగ పోస్టులు పెడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
