కేసీఆర్ పై కోపంతో అంబేద్కర్ కు అవమానం..!

Ambedkar was insulted by his anger at KCR..!
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కోపంతో భారత రాజ్యాంగ నిర్మాత.. తెలంగాణ రాష్ట్రమేర్పాటుకు ఆర్టికల్ -3 ద్వారా కారణమైన మహానీయుడు.. భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ ను సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు అవమానిస్తున్నారు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
మీడియాతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ” డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఇప్పటివరకూ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కనీసం సందర్శించలేదు.
పూల మాల వేయలేదు. ఈ అంబేద్కర్ జయంతి రోజు అయిన సరే నివాళులు ఆర్పించాలని కోరారు. కేసీఆర్ పై కోపం ఉంటే అంబేద్కర్ ఏమి చేశారని ఆమె ప్రశ్నించారు.
