జగన్ పై కేంద్రానికి పిర్యాదు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు రాసిన లేఖలో పిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి తీరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు చోటు చేసుకుంటుంది..
ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది అని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న జగన్ చేసే ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు కలిగించేల ఉన్నాయి. పర్యటనలు.. పరామర్షల పేరుతో విధ్వంస్దాలు సృష్టించాలని జగన్ చూస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు.
రాష్ట్రంలోని పోలీసుల నైతికతను.. మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేలా జగన్ మాట్లాడుతున్నారు. అసలు బెయిల్ పై ఉన్న వ్యక్తి వ్యవస్థలను బెదిరించేలా వ్యవహారించడం బెయిల్ షరత్ లను అతిక్రమించడమే. తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అమిత్ షాను కోరారు.
