రెండో పెళ్లిపై రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!

Renu Desai Indian Actor
ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న ప్రముఖ నటి.. ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయి రెండో పెళ్లి చేసుకోని సంగతి మనకు తెల్సిందే. అఖరికి ఓ ప్రముఖ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్న కానీ అది పెళ్లి పీటల దాక రాలేదు.
అయితే తాజాగా పాడ్ కాస్ట్ లో మాట్లాడిన రేణూ దేశాయ్ మళ్లీ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాడ్ కాస్ట్ లో ఆమె మాట్లాడుతూ నాకు రెండో పెళ్లి చేసుకోవాలని అన్పించింది. కానీ పిల్లల గురించి ఆలోచించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను.
అఖరికి ఓ వ్యక్తితో ఎంగెజ్మెంట్ చేసుకున్న కానీ ఇటు బంధానికి అటు పిల్లలకు సమాన ప్రాధాన్యత ఇవ్వలేనేమో అని అన్పించింది. దీంతో దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాకు. ఇప్పుడు కూతురు ఆద్యకు పదిహేను సంవత్సరాలు. బహుశా ఆద్యకు పద్దెనిమిది ఏండ్లు నిండిన తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఆలోచనలు ఉండోచ్చు అని షాకింగ్ కామెంట్లు చేసింది. అయితే రేణు దేశాయ్ కు ఆద్య. అకీరానందన్ ఇద్దరు పిల్లలు.
