సమంత ఆనందం.. ఎందుకంటే..!

Samantha
నేను గత రెండేళ్లుగా ఒక్క సినిమా చేయలేదు. ఈ మధ్యకాలంలో కనీసం ఒక్క హిట్ మూవీ సైతం నాకు దక్కలేదు. అయినా నాపై అభిమానుల ప్రేమ ఏ మాత్రం తగ్గ లేదు. అయిన ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను.
మీరు లేకుండా నేను లేను’ అంటూ బిహైండ్ వెడ్స్ అవార్డుల వేడుకలో సమంత భావోద్వేగానికి గురయ్యారు. చెన్నైలో జరిగిన ఈ అవార్డుల వేడుకలో.. ప్రతిష్టాత్మకమైన కె.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సమంతను సత్కరిం చారు. దశాబ్దంన్నర నుంచి స్ఫూర్తిదాయకమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తున్నందుకు గాను సమంతకు ఈ గౌరవం దక్కింది.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ‘ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం. ఎన్నో అద్భు తమైన పాత్రలను మనకు పరిచయం చేశారు కె.బాలచందర్ గారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో స్త్రీ పాత్రలు సహజంగా, బలమైన వ్యక్తిత్వంతో ఉంటాయి. నాకెంతో స్ఫూర్తినిచ్చిన పాత్రలు అవన్నీ. ఈ అవార్డు అందుకోవడంతో నా జీవితం పరిపూర్ణ మైనట్టు భావిస్తున్నాను ‘ అంటూ ఎమోషనల్ అయ్యారు సమంత.
