సహాచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ అగ్రహాం

 సహాచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ అగ్రహాం

Danam Nagender’s attack on fellow MLAs

Loading

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తన సహచర ఎమ్మెల్యేలపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతున్న సమయంలో సభలోని తన సహచర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ చేశారు.

దీంతో ఒక్కసారి కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను సీనియ‌ర్ ఎమ్మెల్యేని, ఏం మాట్లాడాలో త‌న‌కు తెలుసని ఇత‌ర ఎమ్మెల్యేల ప‌ట్ల రుస‌రుస‌లాడుతూ నేను మంత్రిగా పని చేశాను.. నేను అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేను. ఎప్పుడు ఎక్కడ ఏమి మాట్లాడాలో నాకు. ఎవరో నాకు చెబితే నేను తెల్సుకోవాల్సిన పని లేదు.

సాక్షాత్తు ఎమ్మెల్యే మంత్రి చెబితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులతో సహా రెవిన్యూ విద్యుత్ అధికారులు పని చేయరు . కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కొంతమంది ఫోన్ చేస్తే మాత్రం ఠక్కున స్పందిస్తారు. వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తారు. కానీ నేను విజ్ఞప్తి చేసి పదిహేను నెలలవుతున్న ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించరు. నా నియోజకవర్గ ప్రజలకు అవసరమయ్యే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు అనుమతిలివ్వరు అని ఆరోపించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *