మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!

Good news for metro passengers..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థకు చెందిన అధికారులు శుభవార్తను చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తో పాటు హైదరాబాద్ లో సైతం ఎండలు పెరిగిపోతుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో ఇక మెట్రోలో వెళ్లాలంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది.
కావున ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ట్రిప్పుల సంఖ్య పెంచాలని భావిస్తున్నట్లు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1,065 ట్రిప్పులు తిరుగుతున్నాయి. అతి త్వరలోనే 1,500 వరకు పెంచుతామని ఆయన తెలిపారు.
