పుష్ప – 2 ను దాటిన ఛావా..?

‘ఛావా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన ఐదో వారం హిందీలో అత్యధిక వసూళ్లు రూ.22కోట్లను సాధించిన సినిమాగా నిలిచింది.
స్త్రీ-2 (రూ.16కోట్లు), పుష్ప–2 (రూ.14కోట్లు) సినిమాల్ని అధిగమించింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇండియాలో నెట్ కలెక్షన్స్ ₹562.65కోట్లకు పైగా వచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా ₹750.5 కోట్లకు పైగా వచ్చాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.
