ఆ స్టార్ నటుడుతో పూరీ జగన్నాథ్ మూవీ..!

Puri Jagannath’s movie with that star actor..!
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. పూరీ చెప్పిన కథ సేతుపతిని మెప్పించింది..
సినిమా చేసేందుకు ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్ లేదా మంచి కమర్షియల్ కంటెంట్తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.
దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంతోనైనా పూరీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
