డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి దొంగలు..!

Thieves at DK Aruna’s house in the middle of the night..!
జూబ్లీహిల్స్ లోని బీజేపీ ఎంపీ.. మాజీ మంత్రి డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి ఆగంతకుడు కలకలం రేపాడు. ముసుగు, క్లౌజులు ధరించి ఇంట్లోకి దుండగుడు చొరబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇంట్లోకి చొరబడి ఆ దుండగుడు కిచెన్, హాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దుండగుడు వచ్చిన సమయంలో ఎంపీ ఇంట్లో లేకపోవడం గమనార్హం.
ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు డీకే అరుణ ఫిర్యాదు చేశారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందని, భద్రత పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.