పవన్ కళ్యాణ్‌కి ప్రకాశ్ రాజ్ దిమ్మ తిరిగే కౌంటర్

Prakash Raj Counter To Pawan Kalyan
చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తమిళనాట హిందీని తమపై రుద్దుతున్నారని హడావిడి చేస్తున్న గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న అన్ని దేశ భాషలే కదా. తమిళనాడులో హిందీ వద్దని అనడం ఎంత వరకు కరెక్ట్. మరి తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి.. కానీ హిందీ భాష వద్దంటే ఎలా? మనం భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి.. బహుభాషలే దేశానికి మంచిది అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు.
అక్కడితో ఆగకుండా ఏకంగా తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలో అయిన ముస్లింలు అరబిక్‌లోనే ప్రార్థిస్తారు. కానీ ఎన్నడూ ఆ భాష తమకొద్దని అనలేదు. హిందువులు మాత్రం దేవాలయాలలో సంస్కృత మంత్రాలు చదవొద్దిని చెబుతుంటారు. ముస్లింలని చూసి హిందువులు చాలా నేర్చుకోవాలి. రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవటం ఏంటి? వివేకం, ఆలోచన ఉండొద్దా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
ఉత్తరాది వాళ్లు తెల్లగా ఉంటారు. మేం దక్షిణాది వాళ్లం నల్లగా ఉంటామనే మాటలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. దక్షిణాదికి చెందిన సెంగోల్.. ఉత్తరాదిన ఉన్న పార్లమెంట్‌లో ఉంది. దీని అర్థ్ధం వైరుధ్యమొస్తే విడిపోవాలని కాదు. కలిసి పరిష్కారం వెతుక్కోవాలని. విధ్వంసం చాలా తేలిక. నిర్మించటమే కష్టం అని ఆయన ఉద్ఘాటించారు.అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు.
‘ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ‘ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ ప్రకాష్ రాజ్ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ గతంలో కూడా పవన్ కళ్యాణ్‌కి కౌంటర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ వ్యవహారం, సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ పంచ్ లు ఇచ్చాడు. ఇక తాజాగా హిందీ భాష అంశంపై చేసిన వ్యాఖ్యలకు కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు.
