రష్మిక మందన్నా సంచలనం..!

టాలీవుడ్ బాలీవుడ్ కన్నడ ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మొత్తం సినీ పరిశ్రమలోనే నేషనల్ క్రష్ .. హాట్ సూపర్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం చాలా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు.
తాను హీరోయిన్ గా నటించిన యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు కారణం అయింది.
గత రెండేళ్లలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన సినిమాలు వరల్డ్ వైడ్ గా మొత్తం రూ.3,300 కోట్లు వసూలు చేశాయి.
హిందీలోనే దాదాపు ₹1850కోట్లు రాబట్టాయి. దీంతో దీపిక, అలియా భట్ వంటి స్టార్ల కంటే రష్మికకే ఎక్కువ సక్సెస్ దక్కింది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ‘సికందర్’, ధనుష్ ‘కుబేర’లో నటిస్తున్నారు.
