ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..!

T.Raja Singh Lodh Member of the Telangana Legislative Assembly
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికెళ్లి పోవాలని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతో రహస్యంగా మా పార్టీ నేతలు భేటీ అవుతున్నారు. గొప్పలు చెప్పుకునేవాళ్లకు రిటైర్మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు.
దీనిపై జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. నేనొక్కడినే కాదు.. ప్రతి బీజేపీ కార్యకర్త ఇదే కోరుకుంటున్నాడు’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
