తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం..!

Jagadish Reddy Suspended
తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ నుండి ఎమ్మెల్యే జగదీశ్ ను సస్పెండ్ చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు . మంత్రులు పట్టుబట్టారు.
సభ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సభనుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ కు ప్రతిపాదిస్తూ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
దీంతో ఎమ్మెల్యే జగదీశ్ ను సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఆయన సభ నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.
