కృష్ణా ట్రైన్ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.!

Bad news for Krishna train passengers!
తిరుపతి నుండి ఆదిలాబాద్.. ఆదిలాబాద్ నుండి తిరుపతికి వెళ్లే కృష్ణా ట్రైన్ ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి ఇకపై రాదు.
ఆదిలాబాద్ నుండి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ మేడ్చల్ దాటగానే మల్కాజిగిరి ముందు టర్న్ తీసుకోని చర్లపల్లి రైల్వేస్టేషన్ కు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ కు వచ్చే సమయంలో సైతం అదే మల్కాజిగిరి ముందు టర్న్ అయి సికింద్రాబాద్ కు రాకుండా మేడ్చల్ ,కామారెడ్డి, ఆదిలాబాద్ వెళ్తుంది.
ప్రయాణికులందరూ ఈ మార్పును గమనించగలరని రైల్వే అధికారులు ఓ ప్రకటనను విడుదలను చేశారు. అయితే ఈ రైలు ప్రయాణ సమయంలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించింది.
