సినిమాల్లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే..!

Former Congress MLA to enter films..!
తాను త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. ఓ ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు.
‘మాఫియాను ఎదిరించి ఓ ఆడపిల్లకు పెళ్లి చేసే క్యారెక్టర్లో కనిపిస్తా. ఈ ఉగాదికి మూవీ స్క్రిప్ట్ వింటా. వచ్చే ఉగాదికి సినిమాను పూర్తి చేస్తాము.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిల అనుమతి తీసుకొని నటిస్తాను. ‘జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ను ఖరారు చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.
