కలెక్టర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పిర్యాదు..!

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పై జనగామ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు అందింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై గెలుపొందిన యశస్విని రెడ్డి అధికారక నివాసమైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి మౌలిక వసతులు కానీ అధికారక కార్యక్రమాలు కానీ జరగడం లేదని స్థానికులు.. ప్రజలు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు.
ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లేకుండానే కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కలెక్టర్కు స్థానికులు పిర్యాదు చేశారు.
