పవన్ కళ్యాణ్ సీఎం కావాలి

ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు టీమిండియా మాజీ ఆటగాడు.. వైసీపీ మాజీ నేత అంబటి రాయుడు ఆకాంక్షించారు. ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో అంబటి రాయుడు మాట్లాడుతూ ” నేను వైసీపీ నుండి నుంచి బయటకొచ్చాక తాను ఏ పార్టీలో చేరలేదని ఆయన వెల్లడించారు.
నేను జనసేన పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చిన అలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇంతవరకూ నేను జనసేనలో చేరలేదు. జనసేన అనేది ఒక ఐడియాలజీ.
పవన్ కళ్యాణ్ ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందుకోసం ఆయన సీఎం కావాలి. అందుకు నేను చేయాల్సిన కృషి 100శాతం చేస్తాను. రాజకీయాల్లోకి రావాలనే నాలాంటి యువకులను కొందరు తొక్కేస్తున్నారు. కానీ యువత రాజకీయాల్లోకి రావాలి’ అని సూచించారు.
