కేఎల్ రాహుల్ ఆవేదన..?

టీమిండియా స్టార్ ఆటగాడు.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తన ఆవేదనను మరోసారి వ్యక్తం చేశారు టీమిండియా ఆడబోయే ప్రతి సిరీస్ ఆరంభానికి ముందు జట్టులో తన చోటు గురించి చర్చ జరగడంపై రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఆడిన ‘ఒక సిరీస్ లో సైతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా మరో సిరీస్ మొదలయ్యే ముందు జట్టులో నా చోటు గురించి చర్చ జరుగుతుంటుంది.
బ్యాటింగ్ ఆర్డర్ లో జట్టు అవసరాల మేరకు కెప్టెన్ ఏం చెబితే అది నేను చేశాను. ఇంకా ఏం చేస్తే ఈ చర్చ ఆగుతుంది? ..కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నాకు ఎప్పుడూ అండగా ఉన్నారు’ అని రాహుల్ తెలిపారు.
