కేసీఆర్ పై కోపంతో మహత్మాగాంధీకి అవమానం..?

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ ఆసుపత్రి ముందు ఆవిష్కరించిన గాంధీ గారి కాంస్య విగ్రహం నిర్వహాణ సరిగాలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందని ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనంపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.. ఎక్స్ లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సిఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారు.
గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప, ఆయన పట్ల, ఆయన సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదు.చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది గాంధీ గారి సిద్ధాంతం అయితే, రేవంత్ రెడ్డి ది చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు అనే సిద్దాంతం
అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేయడానికి ఆయన అనుసరిస్తున్న మూల సూత్రం ఇదే.గాంధీ ఆశయాలే పట్టని కాంగ్రెస్ పార్టీకి, గాంధీ విగ్రహం ఎలా కనిపిస్తుంది.ఉన్న గాంధీ విగ్రహాన్ని చూసుకోవడం చేత కాదు, కానీ బాపు ఘాట్ పునరుద్దరిస్తమని బడాయి కొడుతున్నడు.ఆనాడు ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించుకున్న గాంధీ విగ్రహం, నేడు నిర్వహణ లేక ఈ స్థితిలో ఉండటం బాధాకరం.ఓ మహాత్మా మన్నించు! అంటూ రాసుకోచ్చారు.
