గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు శుభవార్త..!

 గల్ఫ్    కార్మికుల కుటుంబాలకు శుభవార్త..!

Tests in the car..Abortion in the hospital..!

Loading

గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది. 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణా రావును ఆదేశించినట్లు తెలంగాణ ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్బంగా అనిల్ ఈరవత్రి గల్ఫ్ ఎక్స్ గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసికెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నిధుల విడుదలకు ఆదేశాలిచ్చారు.

శనివారం సాయంత్రం అందిన సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లాలో 31, నిజామాబాద్ లో 28, రాజన్న సిరిసిల్ల లో 8, నిర్మల్ లో 5, కామారెడ్డి, సిద్దిపేట నాలుగు చొప్పున, కరీంనగర్, మంచిర్యాల మూడు చొప్పున, మెదక్ లో రెండు, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలలో ఒకటి చొప్పున మొత్తం 94 మంది ఖాతాలలో రూ.5 లక్షల చొప్పున సొమ్ము జమ అయినది.

గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకునేలా రూ.5 లక్షల పరిహారం నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ గౌడ్, అనిల్ ఈరవత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా. ఆర్.భూపతి రెడ్డి, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యం తో పాటు సహకరించిన నాయకులు, గల్ఫ్ కార్మిక నాయకులకు టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *