జనఔషధి కేంద్రాలలో మందులు కొనుక్కోండి..

“ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన” కార్యక్రమంలో భాగంగా “జన ఔషధీ దివస్- 2025″ పేరిట మార్చి ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు”జన చేతన అభియాన్ పాదయాత్ర” కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నేరేడ్మెట్ క్రాస్ రోడ్ లో జన ఔషధీ మెడికల్ షాప్ దగ్గర నుంచి ఈ పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “జనఔషధి కేంద్రాలలో మందులు కొనుక్కోండి..మందుల ఖర్చుల భారం నుండి బయటపాడుదాం.పేదరికం తెలిసిన వాడు కాబట్టే పేదల కోసం పథకాలు :మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి ఆయన వ్యక్తి నరేంద్ర మోడీ,మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశమే గర్వించే పద్ధతిలో రోల్ మోడల్ గా పనిచేశారు.
గుజరాత్ లాగా దేశం అభివృద్ధి చెందుతుందని పార్టీ భావించి వారిని ప్రధానమంత్రిగా ఎంపిక చేసింది.. యావత్ దేశ ప్రజలు మోడీ గారికి తమ ఆత్మ ఆవిష్కరించి ఓట్లు వేశారు. ఈ 11 ఏళ్లలో పేదలకు అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడంలో వారి పాత్ర మాటల్లో చెప్పలేనిది.ఆకలి చవిచూసిన బిడ్డగా, దుఃఖం తెలిసిన బిడ్డగా, ప్లాట్ ఫాం మీద చాయ్ అమ్ముకున్న బిడ్డగా, పేదల కష్టాలు తెలిసిన బిడ్డగా.. దేశ ప్రధాని అయిన తర్వాత ఎన్నో స్కీములను తీసుకువచ్చారు. అందులో భాగంగా వచ్చిందే జనఔషధీ కేంద్రాలు.వైద్యం చాలా భారమైనది, మందులు కొనుక్కోలేకపోతున్నారు వైద్యం మందుల మీద పెట్టే ఖర్చు భరించలేకపోతున్నారు అని పేదవారికోసం చౌక మందులు అందించాలని సంకల్పములో భాగంగా భారతీయ జన ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే 14,600 ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో 50 నుంచి 80% వరకు రాయితీతో నాణ్యమైన మందులను అందిస్తున్నారు.సంపాదనే ఎజెండాగా కుటుంబాలను రాజకీయాల్లోకి తీసుకు వస్తున్న ఈ రోజుల్లో 140 కోట్ల ప్రజలే నా కుటుంబం అని భావించి దేశం కోసం అంకితమైన మహనీయుడు నరేంద్ర మోడీ.గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడారు.75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాకెట్ యుగంలో సాటి మహిళకు ఒక టాయిలెట్ కట్టించలేని దుస్థితి ఉండకూడదని 12 కోట్ల టాయిలెట్స్ కట్టించారు.ప్రపంచవ్యాప్తంగా మోడీ గారి పరిపాలన, భారతదేశ గొప్పతనాన్ని చాటి చెబుతున్న తీరు భారతజాతి ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎంత గొప్పగా ఎదుగుతుందో చూస్తున్నాం. సగటు భారతీయుడు ” ఐ ఆమ్ ఆన్ ఇండియన్” అని చెప్పుకొనే స్థాయికి తీసుకువచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ .కొన్ని మందుల కంపెనీలు, ప్రైవేట్ వ్యాపారులు జనఔషధ కేంద్రాలలో నాణ్యమైన మందులు దొరకవని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి తక్కువ ధరకు అందిస్తుంది. జనఔషధి కేంద్రాలు మరిన్ని ప్రారంభం కావాలి.ప్రజలందరూ ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఫార్మసిటికల్స్ పార్లమెంటరీ స్ట్రండింగ్ కమిటీలో నేను సభ్యున్ని 30 మంది పార్లమెంట్ సభ్యుల్ని మూతపడ్డ ఐడిపిఎల్ కంపెనీకి తీసుకెళ్లాను.. సౌత్ ఇండియాలో నాణ్యమైన మందులు కావాలంటే, అందుబాటులో మందులు కావాలంటే ఐడిపిఎల్ కంపెనీని మళ్లీ పునరుద్ధరించాలని కోరానని తెలిపారు.గోపు రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్కే శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ మీనా ఉపేందర్రెడ్డి గారు, శ్రవణ్ గారు, ఆదిత్య గారు, ప్రసన్న గారు, సుధాకర్ శర్మ, గారు సత్యనారాయణ బాబు గారు, సుదర్శన్ గారు, మాజీ సైనికులు, పలువురు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
