క్రెడిట్ కోసం కాంగ్రెస్ బీజేపీ ఢిష్యూం ..ఢిష్యూం.!

Congress and BJP clash for credit..
తెలంగాణలో వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్టు దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న వరంగల్ ప్రజల ఏళ్లనాటి కల సాకారమవుతోంది. సుమారు 32 ఏళ్ల తర్వాత వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఈ ఉత్తర్వులను జారీ చేశారు.. దీంతో క్రెడిట్ కోసం బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.. మామునూరు ఎయిర్ పోర్టు క్రెడిట్ మాదంటే మాదంటూ ఇరువర్గాలు ఫైట్ చేసుకున్నారు..
శుక్రవారం వరంగల్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వేర్వేరుగా బీజేపీ, కాంగ్రెస్ సంబరాలను చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.. ఒకే సమయంలో ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు దగ్గరకు ఇరు పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు.. పోటాపోటీగా ప్రధాని మోడీ చిత్రపటానికి బీజేపీ, రేవంత్ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితులు చేయి దాటిపోతుందని భావించి అక్కడ భారీగా పోలీసులు మోహరించారు..
