కొల్లాపూర్ లో మంత్రి అనుచరులు వీరంగం

 కొల్లాపూర్ లో మంత్రి అనుచరులు వీరంగం

In Kolhapur, the minister’s followers are a force

4 total views , 1 views today

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కు చెందిన అనుచరులు నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ లో వీరంగం సృష్టించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొల్లాపూర్ మండలంలో శుక్రవారం పర్యటించారు.

ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలుకుతూ బీఆర్‌ఎస్‌ నాయకుడు, కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ గుజ్జల పరమేశ్‌ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి స్థానిక ఎమ్మెల్యే అయిన జూపల్లి కృష్ణారావు కు సంబంధించిన అనుచరులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకుడు, కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ గుజ్జల పరమేశ్‌పైఅధికార పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఈ రోజు రాత్రి డిశ్చార్జ్‌ అయ్యారు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400