జపాన్ లో దేవర..!

 జపాన్ లో దేవర..!

Devara Movie Record

Loading

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా గతేడాది వచ్చిన మూవీ ‘దేవర’.. ఈ చిత్రాన్ని ఇప్పుడు జపాన్ దేశంలో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇండియన్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటి కే ‘ఆర్ఆర్ఆర్’తో పాటు పలు భారతీయ చిత్రాలు అక్కడ విడుదలై సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి.

దీంతో ‘దేవర’ సినిమాను మార్చి 28న జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్.. అక్కడి మీడియాకు వర్చువల్ గా స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. త్వరలోనే డైరెక్ట్ గా కూడా వెళ్లి అక్కడి ప్రమో షన్స్ కార్యక్రమాల్లో హీరో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడట .

కొరటాల శివ రూపొం దించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్లో కనిపించి ఆక ట్టుకున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు. సుధాకర్ మి క్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అనిరుధ్ సంగీతం అందించాడు.రెండు భాగాలుగా రాబోతున్నఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో ‘వార్2’తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *