నీతులు చెబుతున్న రకుల్ ప్రీత్ సింగ్..!

Rakul Preeth Singh
చూడటానికి బక్కపలచుగా ఉంటది.. కానీ అందం మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చేస్తాది. అలాంటి అందగత్తే రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ అలా ఉండాలి.. ఇలా ఉండాలని నీతులు చెప్పుకోస్తుంది. ఇటీవల ఈ రాక్షసి సుందరి జిమ్ లోకెళ్ళి తన తాహత్ కి మించి వ్యయమాలు చేసింది. దీంతో ఈ బక్కపలచు భామ వెన్నుముకకు గాయమైంది. కొన్ని నెలల పాటు అమ్మడు బెడ్ రెస్ట్ కే పరిమితమైంది. దీంతో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ ఏదైన పని చేసేటప్పుడు మన బలానికి మించి వ్యాయామం చేయడం మనకు.
ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదంటూ అంటుంది. దేనికైన పరిమితులుంటాయి. ఆ పరిమితులు దాటోద్దని అందరికీ సూచిస్తుంది. తాజాగా ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో జిమ్ లో వ్యయామం చేస్తుంటే తగిలిన గాయం గురించి స్పందిస్తూ ” పరిమితులు దాటి వ్యయాయం చేయడం వలన తగిలిన గాయం తర్వాత ఏ విషయంలోనూ అతి చేయడం మంచిదికాదని నాకు అర్థమైంది. నా శరీరంపై గౌరవం పెరిగింది.
వ్యాయామం సమ యంలో మన శరీరం తన పరిమితి ఏమిటో తెలియ జెపుతుంది. అక్కడే ఆగిపో వాలి. మన బాడీ స్టామి నాకు మించి వర్కవుట్స్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయొద్దు’ అని జిమ్ కెళ్ళేవాళ్లందరికీ ఆ ఇంటర్వూలో సలహా ఇచ్చింది. గాయం నుంచి కోలు కొని తిరిగి సినిమాల్లో బిజీ కావడం ఆనందంగా ఉందని, ఇక నుంచి భవిష్యత్తుపై .. సినిమాలపై మరింత దృష్టి పెడతానని రకుల్ ప్రీతిసింగ్ పేర్కొంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అర్జున్ కపూర్ సరసన కథానాయికగా నటించిన ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల రాబోతుంది.
