తండేల్ కలెక్షన్ల సునామీ..!

thandel
ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్ గా ఇందులో నటించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
విడుదలైన మొదటిరోజే బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ పలు థియేటర్ల వద్ద కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది.
విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ.80.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. వాలంటైన్స్ వీక్లో బ్లాక్ బస్టర్ తండేల్పై ప్రేమ అన్స్టాపబుల్గా కొనసాగుతుందని పేర్కొంది. నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి.