వీహెచ్ కు ప్రమోషన్.. !

పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుకు కాంగ్రెస్ పార్టీ ప్రమోషన్ ను ఇవ్వనున్నదా…?. అందులో భాగంగా వీహెచ్ ను శాసన మండలి చైర్మన్ గా నియమించాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉన్నాదా ..?. అంటే అవుననే వార్తలు గాంధీ భవన్ నుండి విన్పిస్తున్నాయి.
రానున్న రెండు నెలల్లో మండలిలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీల్లో పార్టీకి విధేయుడు.. బీసీ సామాజిక వర్గ నేత అయిన హనుమంతరావును ఎంపిక చేయాలని పార్టీ అధి నాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే నిజానికి గతంలోనే హను మంతరావును రాజ్యసభకు ఎంపిక చేయాలని పార్టీ అధిష్టానం కసరత్తు చేసింది. కానీ చివరిక్షణంలో మాజీ ఎంపీ అంజాన్ కుమార్ యాదవ్ తనయుడు అనీల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
దీంతో హనుమంత్ రావును తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించాలని భావించినసీఎంరేవంత్ వీహెచ్ ను తన నివాసానికి పిలిపించుకుని ఈ విషయం ప్రస్తావించగా హనుమంతరావు ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్టు అప్పట్లో ప్రచారం సైతం జరిగింది. దీంతో బీసీ కమిషన్ కు మరో సీనియర్ నేత నిరంజన్ ను నియమిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.